Monday, January 31, 2011

మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్న "చిరు" !!

తనకంటూ ఏదో ఒక మీడియా ఉంటే తప్ప రాజకీయంగా తనకు మనుగడ లేదని చాలా ఆలస్యంగా గ్రహించిన చిరంజీవి.. ఎట్టకేలకు ఓ టివి చానల్‌ను కొనుగోలు చేసారని తెలుస్తోంది. "మా" టివిలో చిరంజీవికి కొంత భాగస్వామ్యమున్నప్పటికీ.. అది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ కావడంతో కొత్త చానల్‌ను న్యూస్ చానల్‌గా తీర్చి దిద్దేందుకు చిరంజీవి సన్నాహాలు చేస్తున్నారు."ఆర్.కె టివి" పేరుతో హైద్రాబాద్‌లో లోకల్‌గా నిర్వహించబడుతూ వచిన ఈ చానల్ పేరు మార్చి, రాష్ట్ర స్థాయిలో ప్రసారాలు జరిగేలా చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ పార్టీల కనుసన్నల్లో పనిచేస్తోంది. ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సూర్య, ఏటివి, ఎబియన్, స్టూడియో ఎన్, మహాటివి ఛానల్స్ తెలుసుదేశం అనుకూల వైఖరితో నిర్వహించబడుతుండగా, సాక్షి దినపత్రిక,సాక్షి టివి, టివి ఫైవ్, ఎన్‌ టివి, ఐ న్యూస్ జగన్ వర్గాన్ని బలపరుస్తున్నాయి. రాజ్ న్యూస్‌ను టిఆర్‌ఎస్ ప్రారంభించగా కెసియార్ కుటుంబీకులకు చెందిన హెచ్ ఎం టివిని కూడా టిఆర్‌ఎస్‌ను బలపరుస్తుంది.ఒక్క ప్రజారాజ్యం పార్టీకి మాత్రమే ఏ ఒక్క మీడియా అనుకూలంగా లేదు. దాంతో ప్రజారాజ్యంకు సంబంధించిన వార్తలకు ఏ మాత్రం ప్రాధాన్యత లభించడం లేదు.ఈ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని చిరంజీవి ఎలక్ట్రానిక్ ఛానల్‌ను కొనుగోలు చేసారని తెలుస్తొంది !

Source: www.teluguonline.net 

No comments:

Post a Comment