Friday, January 28, 2011

టివియాంకర్లు మతిపోగొడుతున్నారు!

వాషింగ్టన్: టివితెరపై అందమైన యాంకర్ కనిపిస్తే చాలు మగవారు అటెన్షన్ అంటూ అతుక్కుపోతున్నారని చూపులతో అందాన్ని తాగేస్తున్నారని కాని ఆమె ఏమి చెప్పిందో పట్టించుకోరని ఇండియానా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మగవారికి దినపత్రికలు చదివి వార్తలు తెలుసుకోవటమే ఇష్టమని కాని అందమైన యాంకర్ను చూసేందుకు టివి చూస్తారని తెలిపారు. పరిశోధకురాలు ఎలిజబెత్ రాబే తమ అధ్యయన వివరాలను ఎఓఎల్ న్యూస్ చానెల్కు వివరించారు. ఇందుకోసం వారు పలువురు మగవారిని ఇంటర్వ్యూ చేశారు. 24 ఏళ్ల యాంకర్ సుందరి రెండు సార్లు వార్తలు చదివినప్పటికీ వారు వాటిలో ఒక్కటీ గుర్తుంచుకోలేదు. ఆమె అందాన్ని ఆస్వాదించటమే వారికి సరిపోయింది. పైగా ఆమెకు రెచ్చగొట్టే దుస్తులు ధరింపజేశారు. మరింకేం. వార్తలు ఎలా గుర్తుంటాయి? మరోసారి నగలు ధరింపజేసినప్పటికీ స్పందన మాత్రం ఒక్కలాగే ఉంది. సెక్సీ యాంకర్లంటే మగవారు పడిచస్తారని కాని వారు చెప్పేది బుర్రకు ఎక్కించుకోరని తెలిపారు. దాంతో టివి నెట్వర్క్లు అందమైన అమ్మాయిలను రిక్రూట్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇలా వారు భారీ రేటింగ్లను సంపాదించుకోగలుగుతున్నారు. జర్నల్ ఆఫ్ కమ్యూనికేషన్ రీసెర్చ్లో కూడా ఈ వివరాలను ప్రచురించారు

Source: www.apweekly.com

No comments:

Post a Comment