Tuesday, January 25, 2011

ఆత్మీయంగా పలకరిస్తున్న ‘చిన్నకోడలు’

‘చిన్నకోడలు’ ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ ఆత్మీయంగా, అభిమానంగా పలకరిస్తోంది. మాధవ్ అత్తారింటికి భార్యాసమేతంగా వస్తాడు. తెలుగింటి మర్యాదల్తో కొత్త అల్లుడిని ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారు అత్తామామలు. గ్రామీణ నేపథ్యంలో కొత్త అల్లుడికి ఏర్పాటుచేసే మర్యాదల్లో ‘మూడు నిద్దర్ల ముచ్చట’ కూడా ఒకటి. అలాగే సత్యభామ - మాధవ్‌లకి ఏకాంతాన్ని కల్పించాలని అత్తమామలు అట్టహాసంగా ఏర్పాటు చేస్తారు. ప్రేమించే అమ్మాయి దూరమై, గుండె భారమై మనశ్శాంతి కరవైన మాధవ్.. అవకాశం కోసం ఎదురుచూస్తూ రంగుల ప్రపంచంలో ఎప్పటికైనా విహరించాలని భావించే సత్యభామ. వాళ్లిద్దరినీ ఒక్కటిగా చేయమని మనసారా ఆశించి శ్రీకృష్ణుణ్ని సదా పూజించే రాధిక.. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? ఈ ముగ్గురితోపాటు అడుగడుగునా దుష్ట పన్నాగాలు పనే్న నాగుపాము లాంటి బామ్మగారు మరెన్ని పథకాలు రచిస్తుందో.. రాధికని దక్కించుకోవాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్న సుమంత్ ఎలాంటి ఎత్తులు వేస్తాడో.. ఫలితంగా ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివో ఆద్యంతం ఆసక్తికరంగా సాగబోతోందీ సీరియల్.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment