‘బిగ్ బాస్’ ఫేం సమీర్ సోనీ గత నెల ఓ ఇంటి వాడయ్యాడు. పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు?! మనకి తెలిసినమ్మడే. నీలమ్ కొఠారి. ఒకప్పుడు కొన్ని హిందీ సినిమాల్లో కథానాయికగానూ, సెకండ్ హీరోయిన్‌గానూ నటించిన అమ్మాయి. చాన్నాళ్ళుగా వీరిద్దరి ప్రేమాయణం జనవరి 26తో క్లైమాక్స్‌కి చేరి ‘పెళ్ళి’ బంధంతో ముడిపడ్డారు. పెళ్లి వేడుక వెరైటీగా జరిగింది. విచ్చేసిన బంధువర్గం స్నేహ బృందం ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూండగా చల్లటి వాతావరణంలో వారిద్దరూ ఒకటయ్యారు. ‘బిగ్ బాస్’ తెచ్చి పెట్టిన క్రేజ్‌తో ఆ పెళ్లికి చాలామంది తరలి వచ్చారు. ఇది రొటీన్‌గా జరిగే పెళ్లిలా కాకుండా ‘సమీర్’ స్టైల్‌లో జరిగినట్టు భోగట్టా. ఈ వ్యవహారం అంతా సజావుగా నడిచినప్పటికీ - ఇప్పట్లో ‘హానీమూన్’ ఊసు లేదంటోందీ జంట. ముంబైలో ‘బిగ్ బాస్’ షూటింగ్‌లో ఉండటం మూలాన, నీలమ్ అతనికి వత్తాసు పలకటంతో హానీమూన్‌కి ఎప్పుడు వెళ్ళేదీ త్వరలోనే చెబుతామంటున్నారు.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment