‘గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా..?’ అంటూ ప్రశ్నిస్తే - ఏమో?! కావొచ్చు అని చిరునవ్వులు చిందించిన ఈ చిన్నది ‘నువ్వు-నేను’ ప్రేమపాఠాలు వల్లెవేసి యువతని ఉర్రూతలూగించింది. గతంలో మోడల్‌గా కొన్ని అడ్వర్టయిజ్‌మెంట్లలోనూ.. ఆ తర్వాత సినిమాల్లోనూ అడపాదడపా కనిపించి ఛాన్స్‌లన్నీ‘ఛీ’ కొట్టడంతో - తన దృష్టిని ఛానెళ్లవైపు మరలించింది. అదీ రెండేళ్ల నాటి మాటే. బాలాజీ టెలీ ఫిలిమ్స్ షో ‘కబీ సౌతే కబీ సహేలీ’తో తెర మరుగై మళ్లీ - ఏక్తాకపూర్ సీరియల్ ‘కహానీ హమారే మహాభారత్ కీ..’లో ద్రౌపదిగా నటించింది. జనాలు ఇంత బొద్దుగుమ్మని భరించలేక పోవటంతో ఆ సీరియల్ ఫ్లాప్ అయింది. కానీ- ప్రైవేట్ ఛానెళ్లు ఆమెకి బాగానే కలిసొచ్చాయి. ‘్ఫయర్ ఫాక్టర్’ ‘ఖత్రోంకే ఖిలాడీ’ ‘కామెడీ సర్కస్ కా జాదూ’ ‘డాన్సింగ్ క్వీన్’ లాంటి ఫిక్షన్ షోలలో మెరుస్తోంది. త్వరలోనే అజయ్ సింగ్ చౌదరితో ‘లవ్ స్టోరీ’ అనే షోలో నటించనుంది. ఈ థ్రిల్లింగ్ షోని విక్రమ్ భట్ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘ఏక్ సే బూరే దో’ ‘బెన్నీ అండ్ బబ్లూ’ ‘దస్ కహానియా’లలోనూ మురిపిస్తూ తనకి తానే సాటి అనిపించుకుంటోంది. బాలాజీ టెలీ ఫిలిమ్స్ అనితని ఆదుకుంటోందా? లేక అనితే బాలాజీ ఫిలిమ్స్ ఏకైక హీరోయినా? చూద్దాం.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment