Tuesday, June 7, 2011

వీక్షకుల తీర్పు

చేతకానితనం

సోనీ ఛానెల్‌లో వస్తున్న ‘సిఐడి’ హిందీ సీరియల్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌కి రెండు రోజుల క్రితం మరణించిన వ్యక్తి శవం వస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముఖం మార్చుకున్నట్టు కనిపెట్టి అసలు వ్యక్తి ఫొటోని కంప్యూటర్ ద్వారా తయారుచేస్తారు. విచారణ చేస్తే అది తన భర్త ఫొటో అని చెప్పి ఆయన సంవత్సరం క్రితమే చనిపోయాడంటూ డెత్ సర్ట్ఫికెట్ చూపిస్తుంది ఒకామె. డాక్టర్ చేతకానితనాన్ని ఎద్దేవా చేస్తారు సిఐడిలు. కాస్తంత తెలివి ఉన్న ఎవరైనా డెత్ సర్ట్ఫికెట్‌ని అనుమానించాలి గాని సిఐడిలు మాత్రం తమ శాఖకు చెందిన డాక్టర్నే ఎద్దేవా చేయడం ఏమిటి? చివరకు ఆ డెత్ సర్ట్ఫికెట్ నకిలీదని తేలుతుంది. సిఐడిలు ఇలా ఉన్నారంటూ చూపటం ఏం బాగోలేదు.

-శుభ, కాకినాడ

చెరగని ముద్ర
మాటీవీలో ప్రసారమవుతున్న మా పసలపూడి కథలు బుల్లితెర వీక్షకులకు తీవ్ర నిరాశనే మిగులుస్తున్నాయి. మమతానురాగాలు, ప్రేమానుబంధాలు, మానవత్వం ప్రధానాంశాలుగా వంశీ రచించిన పసలపూడి కథలు పాఠకుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. అయితే ఆ కథలను అంతే హృద్యంగా బుల్లితెర కెక్కించడంలో దర్శకుడు ఘోరంగా విఫలమయ్యాడు. కథలో వున్న కూల్‌నెస్, ఆర్ద్రత పూర్తిగా మిస్సయింది. నటీనటుల హావభావాలు దారుణంగా ఉన్నాయి. పిచ్చి వీర్రాజు కథలో పిచ్చివాడి కేరెక్టరైజేషన్ పక్కనపెట్టి అతడిని చంపే సన్నివేశాలను ఒళ్లు జలదరించేలా చిత్రీకరించారు.
-సి.ప్రతాప్ (సూర్యాపేట)

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment