Monday, June 27, 2011

జాగృతి ఛానెల్‌ ప్రారంభం

తెలుగు ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలో మరో కొత్త ఛానెల్‌ 'జాగృతి' ప్రారంభమైంది. పబ్లిక్‌గార్డెన్స్‌లోని జూబ్లీహాల్‌లో ఈ కార్యక్రమాన్ని ఆదివారం ఆర్భాటంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ శాసన మండలి సభ్యులు వై.శివరామిరెడ్డి 20 సూత్రాల అమలు కమిటీ అధ్యక్షులు తులసీరెడ్డి, శాసన మండలి సభ్యులు జూపూడి ప్రభాకర్‌రావు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు చాడా వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బిజెపి మాజీ అధ్యక్షులు బండారు దత్తాత్రేయ సభలో మాట్లాడుతూ ప్రజోపకరమైన వార్తలకు కేంద్రం జాగృతి కావాలన్నారు. రాష్ట్ర రెవెన్యూ(దేవదాయ)శాఖ ముఖ్య కారదర్శి డాక్టర్‌ కెవి.రమణ మాట్లాడుతూ వివాదాస్పద వార్తలుకాక, వివేచన, విచక్షణతో కూడిన వార్తలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. జాగృతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశిధర్‌రెడ్డి తమ స్వాగత వచనాల్లో సంస్కృతి, సాహితీ రంగాల్లో కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు, గ్రామీణ ప్రాంతాలోని ప్రజల అవసరాలను సమాజం దృష్టికి తెచ్చేందుకు జాగృతి ఛానెల్‌ మాధ్యం కాగలదని తెలిపారు.

Source: www.prajasakti.com

No comments:

Post a Comment