Thursday, June 16, 2011

టీవీ ఎంతెక్కువ చూస్తే.. చావు అంత దగ్గరకు..!

బోస్టన్: టీవీని అదేపనిగా కళ్లప్పగించి చూస్తూ.. కాలం గడిపేస్తున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే.. ఎందుకంటే టీవీ చూడటమే జీవితంగా గడిపేవారు ముందుగా బకెట్ తన్నేసే ప్రమాదముందంటున్నారు హార్వర్డ్ వర్సిటీ పరిశోధకులు. రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూసేవారికి టైప్-2 మధుమేహం, గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదముందని.. అదే 3 గంటలకు మించి చూసేవారు అకాల మరణం (ముందుగా చనిపోయే అవకాశాలు) చెందే అవకాశాలున్నాయని వీరు హెచ్చరించారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ మేరకు ఓ అధ్యయనం నిర్వహించారు. ‘రోజుకు మరో రెండు గంటలు అదనంగా టీవీ చూసేవారికి టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం 20 శాతం, గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులొచ్చే అవకాశం 15 శాతం, ముందుగా చనిపోయే ప్రమాదం 13 శాతం మేర పెరుగుతుంది. మేమిచ్చే సందేశం చాలా సరళమైనది. టీవీ చూడటం తగ్గించండి. అప్పుడు ఈ వ్యాధులొచ్చే ప్రమాదమూ తగ్గుతుంది’ అని సీనియర్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు.

Source: www.sakshi.com

No comments:

Post a Comment