సీమాంధ్ర చానల్ టీవీ9 యాంకర్ సుమతికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు క్లాస్ పీకిండు. కరీంనగర్‌లో టీడీపీ రణభేరి జరిగినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై తెలంగాణవాదులు దాడిచేసిన్రు. అది చేసింది టీఆర్ఎస్ అంటూ టీవీ9 అలవాటు ప్రకారంగానే హల్‌చల్ చేసింది. హరీష్‌రావును ఫోన్‌ఇన్‌లోకి తీసుకుని పీసీఆర్‌లో ఉన్న ఆంధ్రా న్యూస్ ఎడిటర్ కొశ్చన్ అడిగించిండు. హరీష్‌రావుగారు మైనంపల్లిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని వార్తలు వినిపిస్తున్నయి మీరెమంటరు అని సుమతి అడిగింది. హరీష్‌రావు నిజాలు మాట్లాడుడు మొదలుపెట్టిన్రు. మేము దాడి చేసిన్రని టీవీ9 నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తనని సవాల్ విసిరిండు. దెబ్బకు జడుసుకున్న ఎడిటర్ ఫోన్ కట్ చేయించిండు. మళ్లీ అవరమొచ్చి టీవీ9 హరీష్‌రావుకు ఫోన్ కలిపిన్రు. అప్పుడు హరీష్‌రావు టీవీ9ను తీవ్రంగా విమర్శించిండు. మీకు అవసరమొచ్చినప్పుడు ఫోన్ కలుస్తది. లేకపోతే లైన్ కట్ అవుతదా అని సుమతికి క్లాస్ పీకిండు. టీవీ9 సమైక్యవాద వైఖరిని టీడీపీ పక్షపాత వైఖరిని ఎండగట్టిండు.
Source: www.porutelangana.com
No comments:
Post a Comment