ఆంధ్రజ్యోతి పత్రికపై కేసీఆర్ మండిపడుతున్నారు. నిజానికి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కేసీఆర్‌కు మధ్య చాలా సన్నిహిత సంబంధాలుండేవి. గత ఎన్నికల సమయంలో టీడీపీ టీఆర్ఎస్‌ల మధ్య పొత్తు కుదిరే సమయంలో రాధాకృష్ణ కూడా క్రియాశీలక పాత్ర పోషించారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఒక టీవీ షోలో సైతం.. లగడపాటి కేసీఆర్ మాట్లాడేవిధంగా కూడా కేసీఆర్ ప్రభావితమయ్యారంటే వారి మధ్య ఉన్న స్నేహం అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా కేసీఆర్ ఆంధ్రజ్యోతి పత్రికపై విరుచుకుపడటం.. అదంతా తన సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ప్రచురించడం విశేషంగా ఉంది. జేఏసీ నాయకులను గందరగోళంలో పడేయాలని ఆంధ్రజ్యోతి గాలి వార్తలు రాస్తుందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. పనిగట్టుకుని లేని వార్తలు సృష్టిస్తుందని.. పత్రిక ఎల్లో జర్నలిజంగా మారిందని.. ఇలాంటి చెత్త వార్తలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పూర్తిగా అభూతకల్పనతో నిరాధార కల్పిత వార్తలను ఆంధ్రజ్యోతి రాస్తుందని ఆయన విమర్శించారు. జేఏసీ సమావేశ తేదీలను తాను నిర్ణయించినట్లు రాయడం దుర్మార్గం అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కేసీఆర్ ఆంధ్రజ్యోతిపై మండిపడితే.. జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్.. సీమాంధ్ర మీడియా పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తుందని.. జేఏసీలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇలాగే సీమాంధ్ర మీడియా.. తెలంగాణ జేఏసీ అంతర్గత వార్తలు వ్యతిరేకంగా రాసిన మీడియాపై ఆయా నాయకులు ప్రకటనలతో ఈ పత్రిక పెద్ద కథనాన్నే రాసింది. అయితే జేఏసీ సంబంధించిన వార్తలు జేఏసీలో ఏర్పడిన అసంతృప్తికి సంబంధించిన వార్తలు ఒక్క ఆంధ్రజ్యోతిలో మాత్రమే రాలేదు. కొన్ని జాతీయ ఆంగ్ల పత్రికలు టైమ్స్, ఎక్స్‌ప్రెస్ వంటివాటిలో కూడా ప్రచురితమయ్యాయి. కాకపోతే ఈ నాయకులు.. సీమాంధ్ర మీడియా అనో.. ఇతర మీడియా అనో విమర్శలు చేస్తూ.. తెలంగాణ వాదులను సంతృప్తి పర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబరుస్తోంది. సర్క్యూలేషన్ పరంగా కూడా వ్యూహాత్మకంగా ఇతర మీడియాపై వీరు దాడి చేస్తున్న విశ్లేషణ కూడా లేకపోలేదు.
Source: kommineni.info
No comments:
Post a Comment