Saturday, June 18, 2011

డబుల్‌ సెంచరీ దాటిన డిస్నీ ఛానల్‌

యావత్‌ భారతదేశంలో పిల్లలకు వినోదాన్ని అంది ంచడంలో మరో సారి డిస్నీ ఛానల్‌ నెం. 1 గా నిలి చింది. హెచ్‌ ఎస్‌ఎం, దేశ వ్యా ప్తంగా కూడా ఈ ఛానల్‌ వరుసగా 228, 196 జీఆర్‌పి లతో నెం.1గా ఎంపికైంది. ఐదేళ్ళలో ఏదైనా పిల్లల ఛానల్‌ 200 జీఆర్‌పిలను అధిగమించ డం ఇదే తొలిసారి. డిస్నీకి చెందిన మరో ఛానల్‌ డిస్నీ ఎక్స్‌డి కూడా దక్షిణాది మార్కెట్‌లో 134 జీఆర్‌పిలతో నెం.1గా నిలిచింది. హంగామా టీవీతో కూడా కలిపి డిస్నీ నెట్‌వర్క్‌ 45 శాతం వ్యూయర్‌షిప్‌తో నెం.1గా ఉంది. డిస్నీ పాత్రలు, కథల్లో ఈ ఛానల్‌ 100 శాతం వృద్ధిని సాధించింది. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ నిక్కీ, ఫినియాస్‌, ఫెర్బ్‌, ఆర్ట్‌ అటాక్‌, ఫిష్‌ హుక్స్‌, మిక్కీమౌస్‌ క్లబ్‌హౌజ్‌, డోరెమాన్‌ లాంటివెన్నో ఇందులో ఉన్నాయి. వీక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోందని నటాషా ఈ సందర్భంగా అన్నారు. డిస్నీ ఛానల్‌, డిస్నీ ఎక్స్‌డీ, హంగామా టీవీలతో కూడిన డిస్నీ నెట్‌వర్క్‌ అద్బుతమైన కంటెంట్‌ తో గణనీయ వృద్ధిని సాధించిందని అన్నారు. మరింత వినోదాత్మకం, నూతన షోలు, పోటీలతో డిస్నీ నెట్‌వర్క్‌ వీక్షకుల ముందుకు రానుందని అన్నారు.

Source: www.visalaandhra.com

No comments:

Post a Comment