Tuesday, February 1, 2011

ఇన్నాళ్ళకి?

ఎనిమిదేళ్ల వయసు నుంచీ -‘నటి’ కావాలన్న ఆమె కోరిక ‘సుగ్న’తో తీరింది. ‘బాలికా వధు’ సీరియల్‌లో ఆ పాత్రకి ‘విభా ఆనంద్’ ఎంచక్కా సరిపోయిందన్న ప్రశంసలూ వచ్చాయి. పదవ తరగతి ఇట్టే ఫినిష్ చేసేసి... మూటా ముల్లె సర్దుకుని తండ్రితోపాటు ముంబై చేరుకుంది తన కలల్ని పండించుకోవటానికి. ఇదేమంత ఆషామాషీ వ్యవహారం కాదనీ.. అనుకున్న వెంటనే అవకాశాలు వచ్చి పడవన్న విషయం చాన్నాళ్ళకు గాని తెలిసి రాలేదు. అయితే మొక్కవోని ఆమె ఆత్మవిశ్వాసం ముందు ఆ సమస్యలన్నీ గడ్డిపోచలయ్యాయి. కష్టానికి తగిన ఫలితం దక్కింది. ‘బాలికా వధు’లో ఆమె విభిన్న పాత్రల్ని పోషించి మెప్పించింది. చిన్నారి భార్యగా, వితంతువుగా, తల్లిగా.. ఇలా ఎన్నో.


Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment