Tuesday, February 1, 2011

అనుకోని మలుపు?

సన్నగా నాజూగ్గా.. ఏ హైస్కూల్ అమ్మాయో ‘సెట్’లోకి వచ్చేసిందేమోనన్న భ్రాంతిలో ఉండిపోయేవారట రతన్ రాజ్‌పుత్‌ని చూస్తే. ‘స్వయంవర్’ ‘రతన్ కా రిస్తా’.. యూనిట్ అంతా ఆశ్చర్యపోయార్ట కూడా. ఇంత ‘లేత’ వయసులో ఎంతటి ప్రతిభ అన్నార్ట. ఈ మాటలన్ని ఏమోగానీ - కెరీర్ పుంజుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి ‘స్వయంవరాన్ని’ ప్రకటించి పెళ్లి చేసేసుకోబోతోంది రతన్. ఇలా యువత గుండెకి గాయం చేయుట తగునా? అని ప్రశ్నిస్తే- జీవితంలో అమ్మాయికి ఇంతకంటె అదృష్టం మరేం ఉంటుంది?! త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలన్న నా కల ఇంత త్వరగా తీరుతుందని అనుకోలేదంటూ ఆరిందాలా మాట్లాడుతోంది.

నేనో సామాన్య మధ్యతరగతి అమ్మాయిని. అంతగా ఆశలూ లేవు. కోరికలూ లేవు. నాకు నలుగురు అక్కచెల్లెళ్లు. మా కుటుంబ పరిస్థితి తెలుసు. నాలుగేళ్ల క్రితం పాట్నా నుంచి ముంబై వచ్చాం. సీరియళ్ల ద్వారా కెరీర్‌ని ప్రారంభించా. రేపటి గురించిన ఆలోచన ఎప్పుడూ చేయను. ‘స్వయంవర్’ నా జీవితంలో అనుకోని మలుపు అంటూ ముగించింది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment