Wednesday, February 16, 2011

మొబైల్‍లో క్రికెట్

మొబైల్‍లో ఐసిసి వరల్డ్‌కప్ టివి మ్యాచ్‌లా? నమ్మవచ్చా? మనకళ్లు మనల్ని మోసం చేయవుకదా? నిక్షేపంగా నమ్మవచ్చని, మనకళ్లు మనలను మోసం చేయవని అంటున్నారు. టైమ్స్ ఇంటర్నెట్ వారు. మొబైల్ కంటెంట్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఈ సంస్థ త్వరలో జరగనున్న వరల్డ్‌కప్ ఈవెంట్‍ను మొబైల్స్‌లో అందజేస్తుంది. వరల్డ్‌కప్ ఈవెంట్‍కు రిలయెన్స్ కమ్యూనికేషన్స్ నుంచి ప్రత్యేక మొబైల్ హక్కులు పొందిన ఈ సంస్థ  ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్ అండ్ వీడియో, లైవ్ ఆడియో కామెంటరీ తదితరాల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తుంది. మోబైల్ వినియోగదారులందరికీ వరల్డ్‌కప్ విశేషాలను అందజేయగలమని, ఇందుకు తాము ఎంతో గర్విస్తున్నామని టైమ్స్ ఇంటర్నెట్ వర్గాలు పేర్కోన్నాయి. మరి మొబైల్స్‌లో క్రికెట్‍ను చూస్తూ పరవశించిపోవడానికి సిద్ధం కండి మరి!

Source: medianx.tv

No comments:

Post a Comment