Monday, February 21, 2011

కొత్తగా బ్రాడ్ కాస్టింగ్ కౌన్సిల్ ఏర్పాటు


ప్రజలకు మీడియాకు మధ్య సమన్వయం మరింతగా పెరిగేందుకు కేంద్రం కొత్తగా బ్రాడ్‌కాస్టింగ్ కౌన్సిల్‍ను ఏర్పాటు చేసింది. మీడియా స్వయం నియంత్రణను పాటించేలా చూసేందుకు ఈ కౌన్సిల్ తోడ్పడుతుందని సమాచార, ప్రసారశాఖ మంత్రి అంబికాసోని చెప్పారు. ఇందులో 13 మంది సభ్యులు ఉంటారని అన్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యాన ఈ కౌన్సిల్‌ పని చేస్తుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కౌన్సిల్‍కు, ప్రభుత్వానికి సంబంధం ఉండదని అంబికాసోని వివరించారు. ఈ కౌన్సిల్ ఏర్పాటును కేంద్ర క్యాబినెట్ ఆమోదించవలసి ఉంటుందని ఆమె అన్నారు. ఏడాదిగా ఈ కౌన్సిల్ ఏర్పాటుపై కేంద్రంలో చర్చలు జరిగాయని, కొందరు మహిళలు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారని ఆమె తెలిపారు.

Source: medianx.tv

No comments:

Post a Comment