Wednesday, February 16, 2011

టిఎస్‌ఆర్‌-టివి 9 ఫిల్మ్‌ అవార్డ్సు

టి.సుబ్బిరామిరెడ్డి కళాపరిషత్‌ వారు టిఎస్‌ ఆర్‌- టివీ9 అవార్డులను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన విశేషాలను వెల్లడించడానికి తాజ్‌ కృష్ణాలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. డాక్టర్‌ టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇస్తున్న ఫిలింఫేర్‌ అవార్డుల ప్రేరణతో తెలుగు సినిమాలకు ఆ తరహాలో అవార్డులు ఇవ్వాలనే ఆలోచనతో ఈ అవార్డులను ప్రారంభించాము. ప్రజల ద్వారా ఈ అవార్డు విజేతలను ఎన్నుకుంటాము. ఈ అవార్డుల నామినీస్‌ విషయానికి ఈ క్రింది విభాగాల్లో ఉంటాయి. ఉత్తమ హీరో, హీరోయిన్‌, ఉత్తమ నటి, ఉత్తమనటుడు, ఉత్తమ నూతన కథానాయకుడు, కథానా యిక, ఉత్తమ సహాయ నటుడు, నటి, ఉత్తమ పురుష హాస్యనటుడు, హాస్యనటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాత, ఉత్తమ గాయకుడు, గాయని, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ కెమెరామెన్‌, ఉత్తమ కథా రచయిత, ఉత్తమ గేయ రచయిత, లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు. ఈ టిఎస్‌ఆర్‌- టివి9 అవార్డుల కమెటీ మెంబ ర్లుగా డాక్టర్‌ టి.సుబ్బిరామిరెడ్డి, కర్నాటక మాజీ గవర్నర్‌ రమాదేవి, జస్టిస్‌ సుభాషిణీరెడ్డి, డాక్టర్‌ డి.రామానాయుడు, ఆర్‌.వి. రమణమూర్తి, టివి9 సిఈవో రవిప్రకాష్‌లు వ్యవహారిస్తున్నారు. వీటిని టీవి9లో వచ్చే ప్రోమోస్‌ ద్వారా ప్రేక్షకులచే ఎంపిక చేస్తారు. అలాగే ఎస్‌.ఎం.ఎస్‌ ద్వారా ఉత్తరాల ద్వారా విజేతలను ఎంపిక చేయడం జరుగు తుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏప్రిల్‌ 10న జరుగనుంది. అక్కడే విజేతలను ప్రకటించే ప్రక్రియలో దీనిని నిర్వహించనున్నాము. హిందీ నుండి ధర్మేంద్ర, విద్యాబాలన్‌ తదితరులు రావడానికి ఒప్పుకున్నారు. వారు అవార్డులు ఇవ్వడమే కాకుండా డాన్స్‌లు కూడా చేయనున్నారు. ఈ నెల 18 నుండి మార్చి 25 వరకు ప్రోమోస్‌ ప్రసారమౌతాయి. ప్రజలు ఎవ్వరిని ఎన్నుకుంటే వారికే అవార్డులు ఇవ్వనున్నాము. దీనికి టివి 9 వారు పాలు పంచుకున్నా కూడా అన్ని ఛానళ్ళు దీన్ని కవర్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. ఎలాంటి అంక్షలు లేవు, చెన్నైలో, బెంగుళూరు, ముంబై,  ఢిల్లీలో ఉన్న తెలుగు వారి కోసం కూడా కల్చరల్‌ యాక్టివిటీస్‌ డెవలప్‌ చేయాలను కుంటున్నాము అన్నారు. డాక్టర్‌ డి.రామానాయుడు మాట్లా డుతూ సుబ్బిరామిరెడ్డి వారి పేరుతో దీన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. రవీంద్రభారతి లాంటి కట్టాలని తపన పడుతున్నారు. వారు తలపెట్టిన కార్యక్రమం సక్సెస్‌ అవుతాయి. సినిమా పరిశ్రమ నుండి కూడా వారికి సహకారం ఉంటుంది. ఏప్రిల్‌ నెలలో ఫిలింఫేర్‌ అవార్డుకంటే బాగా చేయనున్నాము అన్నారు.

జస్టిస్‌ సుభాషిణీరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. సుబ్బిరామిరెడ్డి విద్యార్థి దశ నుండి నాకు తెలుసు. ఆయనలో బహుముఖాలు ఉన్నాయి. ఆయనకు కళలను ప్రోత్సహించడం అంటే ఇష్టం. ఆయన మంచి సినిమాలు చేశారు. భగవద్గీత, స్వామి వివేకానంద లాంటి సినిమాలు తీశారు. రాజ్యాంగంలో కూడా ఈ కల్చరల్‌ యాక్టివిటీ గురించి ఉంది. కళను ప్రోత్సహించడం ఆనందించ తగ్గ విషయం ఈ అవార్డుల కమెటీలో ఉన్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ రమా దేవి, డాక్టర్‌ డి.రామానాయుడు, డాక్టర్‌ టి.సుబ్బిరామిరెడ్డి, ఆర్‌.వి. రమణమూర్తిలు పాల్గొన్నారు.
 
Source: www.visalaandhra.com

No comments:

Post a Comment