ఐసిసి ప్రపంచ క్రికెట్ పుణ్యమా అని వివిధ ఎలక్ట్రానిక్ సంస్థలు కస్టమర్లకు ఆఫర్‌లమీద ఆఫర్లు ఇస్తున్నాయి. ఎల్‍జి ఇండియా, శ్యాంసంగ్, వీడియోకాన్, తోషిబా, ఒనిడా లాంటి సంస్థలన్నీ ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా, పరోక్షంగా క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. తాము మ్యాచ్‌లను హైడెఫినిషన్ ఫార్మాట్‍లో ప్రసారం చేస్తామని ఎల్‍జి ఇండియా వర్గాలు చెబుతున్నాయి. తమ త్రీడి ఎల్‍ఇడి టివిని కొనుగోలు చేసినవారికి ఉచితంగా బ్లూరే ప్లేయర్‌ను అందజేస్తామని, కస్టమర్ 11 శాతం డౌన్ పేమెంట్ చేస్తే – మిగతా మొత్తాన్ని వడ్డీ లేకుండా 11 వాయిదాల్లో చెల్లించవచ్చని ఈ వర్గాలు తెలిపాయి. అలాగే శ్యాంసంగ్ తమ ఫ్లాట్ పానెల్ టివిని కొనుగోలు చేసేవారు మొదట 1999 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని అంటోంది. ప్రాసెసింగ్ ఫీజుగానీ, వడ్డీగానీ లేకుండా మిగతా మొత్తాన్ని 17 వాయిదాల్లో చెల్లించవచ్చని అంటోంది.
వీడియోకాన్ వారు ‘గోల్డ్‌కప్’ స్కీమ్‌ను ప్రవేశ పెట్టారు. తమ ఎల్‍సిడిని కొంటే – 22 క్యారెట్ల ప్యూర్‌గోల్డ్ కానుక లభించే స్క్రాచ్‌కార్డ్ సౌకర్యం ఉంటుందని వీడియోకాన్ అంటోంది. ఇంకా 8 వేల రూపాయల వరకు క్యాష్ ప్రైజులు కూడా ఉంటాయని ఈ సంస్థ ఊరిస్తోంది.
Source: medianx.tv
No comments:
Post a Comment