Monday, February 21, 2011

కలర్స్ కొత్త ప్రోగ్రామ్స్

వీకెండ్‌లో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేందుకు కలర్స్ ఛానెల్ సరికొత్త ప్రసారాలు చేపడుతోంది. శనివారాలలో “షాన్‌దార్ శనివార్” పేరిట “వాంటెడ్ హైఅలర్ట్’ టైటిల్‍తో ఓ పరిశోధనాత్మక సీరియల్‍ను ప్రారంభిస్తోంది. ఇది రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే రాత్రి 11 గంటలకు “అంధేరా” పేరిట ఓ హారర్ సీరియల్ ప్రసారమవుతుంది. ముఖ్యంగా పురుషులు, యువతను ఆకట్టుకోవాలన్నదీ తమ ఉద్దేశ్యమని ఈ ఛానెల్ వర్గాలు తెలిపాయి.

“వాంటెడ్ హై అలర్ట్”లో హత్యలు, అత్యాచారాలు, ఫ్రాడ్, గృహహింస వంటి నేరాల కథనాలు ఉంటాయి. వీటిలో కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తారు.

Source: medianx.tv

No comments:

Post a Comment