ఐసిసి వరల్డ్ కప్ మ్యాచ్‌లను అనధికారికంగా ప్రసారం చేయవద్దని ఢిల్లీ హైకోర్టు అక్కడి కేబుల్ ఆపరేటర్లను ఆదేశించింది. ప్రపంచకప్ ప్రసార హక్కులను పొందిన ఇఎస్‌పిఎన్ ఛానల్ దాఖలు చేసిన దావాను పురస్కరించుకుని కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో పలువురు కేబుల్ ఆపరేటర్లు తమ అనుమతి లేకుండా అనధికారిక కనెక్షన్లు తీసుకుని ఇష్టం వచ్చినట్టు మ్యాచ్‌లను టెలికాస్ట్ చేస్తున్నారని ఈ ఛానెల్ పేర్కొంది. లైసెన్స్ లేకుండా కొందరు ఇఎస్‌పిఎన్, స్టార్ స్పోర్ట్స్, స్టార్ క్రికెట్ ఛానెల్స్ నుంచి ‘ఫీడ్’ తీసుకొంటున్నారని ఈ ఛానల్ వివరించింది.
Source: medianx.tv
No comments:
Post a Comment