పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్‌మార్ శాటిలైట్ హక్కులను మా టీవీ వారు తీసుకున్నారు. ఈ రైట్స్ కోసం మిగతా ఛానెల్స్ నుంచి పోటీ వచ్చినా చిరంజీవికి, మా టీవీకి ఉన్న రిలేషన్ దృష్ట్యా దీనిని ఫ్యాన్సీ రేటుకు కాకుండా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఇచ్చివేసినట్లు తెలుస్తోంది. ఇక మా టీవీ వారు కొత్తగా పెట్టిన మా మూవీస్ కోసం ఈ సినిమాను తీసుకున్నారు. త్రిష,పవన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్‌కి రీమేక్. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో మార్చి మొదటి వారంలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్‌గా కనిపించనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Source: thatstelugu.oneindia.in
No comments:
Post a Comment