కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘దబాంగ్’ చిత్రం మీడియాను సైతం ప్రభావితం చేసింది. ఏకంగా ‘దబాంగ్’ పేరుతో ఓ హిందీ ఛానెల్ ప్రారంభమైంది. మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మేజర్ పాత్ర పోషిస్తున్న “శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‍వర్క్” కొత్తగా ‘దబాంగ్’ “ధమాల్” అనే రెండు హిందీ ఛానెల్స్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దబాంగ్ ఛానెల్ యుపి, బీహార్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్‌లలో, ధమాల్ ఛానెల్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో తమ సేవలు అందిస్తాయి. శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‍వర్క్‌కు తెలుగుతో సహా వివిధ భాషల్లో ప్రాంతీయ ఛానెల్స్ ఉన్నాయి.
Source: medianx.tv
No comments:
Post a Comment