యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్న ఎంటివి ఛానెల్ మ్యాగజైన్ మీద దృష్టి సారించింది. ‘ఎంటివి యూత్ టైమ్స్’ పేరిట ఓ మ్యాగజైన్‌ను ఈ నెలనుంచి ప్రారంభిస్తోంది. కాలేజీ కారిడార్లలోని యువత ఆలోచనలను, ఈ మ్యాగజైన్ ప్రతిబింబిస్తుంది. ఎస్‌ఎంఎస్, గాసిప్స్ ట్వీట్స్, ఛాట్‍లతో యూత్‌ను ఆకట్టుకునేందుకు ఎంటివి ఇలాంటి సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇది మ్యాగజైనే కానీ వార్తా పత్రిక తరహాలో ఉంటుంది. దేశంలో యువత ప్రాధాన్యాన్ని ఇది చాటి చెబుతుందని ఎంటివి వర్గాలు తెలిపాయి. ఎంటివి యూత్ టైమ్స్‌లో వివిధ వార్తాంశాలు కూడా ఉంటాయని ఈ వర్గాలు వివరించాయి.
Source: medianx.tv
No comments:
Post a Comment