Monday, February 28, 2011

‘సువర్ణ’లో సరికొత్త రియాల్టీషో

కర్నాటకలోని సువర్ణ ఛానెల్ సరికొత్త రియాల్టీషోకు శ్రీకారం చుట్టింది. అటవీ ప్రాంతం నేపధ్యంలో సాగే రెండో రియాల్టీషో ఇది! ‘ప్యాతె హుడిగిరు హళ్లి లైఫ్’ పేరిట ఈ షో ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 8 గంటల స్లాట్‍లో ఇది ప్రసారమవుతుంది. 12 మంది యువతులు కర్నాటక బాదామీ తాలూకాలోని ఓ గ్రామంలో 65 రోజుల పాటు గడిపి అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడమే ఈ షో ఉద్దేశ్యం. ఆ గ్రామ సంస్కృతి, గ్రామ వాసుల ఆచారాలను వారు ఆకళింపు చేసుకుంటారు. ఇందులో ఆ గ్రామీణులే కీలకపాత్ర వహిస్తారు. ఈ యువతులకు తగిన గైడెన్స్ ఇస్తారు. వారే న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఈ బాలికల తీరు నచ్చకపొతే వారే ఎలిమినేట్ చేస్తారు. ఇది వరకు ఫారెస్ట్ థీమ్‌తో తీసిన రియాల్టీషోలకు యాంకర్‌గా వ్యవహరించిన అకుల్ బాలాజీ ఈ తాజా షోకు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తారు.

Source: medianx.tv

No comments:

Post a Comment