Monday, February 21, 2011

బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారాలు

భారత ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించి మార్కెట్లను ప్రభావితం చేసి కేంద్ర బడ్జెట్‍ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇంగ్లీష్ బిజినెస్ న్యూస్ ఛానెల్ సిఎన్‌బిసి, టివి 18 సిద్ధంగా ఉంది. పార్లమెంట్‍లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‍ను ఈ ఛానెల్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెల రోజుల పాటు అందిస్తుంది. దీంతో పాటు ప్రత్యేక బడ్జెట్ ప్రసారాలు ఉంటాయి. కేటాయింపులు, పద్దులు, రాయితీలు, ఖర్చులు, వడ్డింపులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల మోతలు తదితరాలతో కూడిన బడ్జెట్ అంటే అన్ని వర్గాల ప్రజలకు ఆసక్తే! అల్పాదాయ, మధ్యాదాయ, ఉన్నత వర్గాలన్నీ కొత్త బడ్జెట్ ఎలా ఉండబోతోందోనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ ఛానెళ్లన్నీ బడ్జెట్ ప్రసారాలకు సంసిద్ధంగా ఉన్నాయి. విశ్లేషణలు, ఇంటర్వ్యూలతో కూడిన ఈ కార్యక్రమాలు నెల రోజుల పాటు సాగడం విశేషం.

Source: medianx.tv

No comments:

Post a Comment