క్రికెట్ సంరంభం త్వరలో ప్రారభం కానుంది. ఈ నేపథ్యంలో- నింబస్ కమ్యునికేషన్స్ వారు కొత్తగా రెండు ఛానల్స్‌ను ప్రారంభిస్తున్నారు. “నియో సినిమా’, “నియో జిందగీ” పేరిట ఇవి ప్రారంభమవుతాయి. బాలీవుడ్ సినిమాలపై ఆధారపడి నియో సినిమాను, కేవలం మహిళలకోసం ‘నియో జిందగీ’ ఛానల్‌ను లాంచ్ చేస్తున్నారు.
ఇఎస్‌పిఎన్, టెన్ స్పోర్ట్స్ వంటి వివిధ క్రీడా ఛానల్స్‌తో పోటీపడే ఈ సంస్థ – సాకర్, గోల్ఫ్, హాకీ వరల్డ్ సిరీస్ వంటి ఇతర క్రీడల ప్రసార హక్కులు పొందేందుకు యత్నిస్తోంది. పాత, కొత్త బాలీవుడ్ చిత్రాలను తన ‘నియో సినిమా’ ఛానల్‍లో ప్రసారం చేయడానికి ‘నింబస్’ ఉవ్విళ్లూరుతోంది. మా మూవీ ఛానల్‍లాగే ఈ ఛానల్ కూడా చిత్రాల ప్రసారం మీద దృష్టి నిలుపుతోంది.
Source: medianx.tv
No comments:
Post a Comment