Friday, February 18, 2011

కేబుల్ టివిలో విదేశీ పెట్టుబడులు

అన్నీ అనుకూలిస్తే ఇకపై మనదేశంలో కేబుల్ టివి, ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియో కేంద్రాల్లో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) వెల్లువలా వచ్చి పడే అవకాశం ఉంది.

వీటిలో
ఎఫ్‌డిఐలను పెంచడంవల్ల ప్రయోజనం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఎఫ్‌ఎం రేడియోల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను  20  నుంచి  26 శాతానికి పెంచాలనుకుంటున్నారు. అలాగే కేబుల్ టివి రంగంలో దీన్నీ  49 శాతంనుంచి  74 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. దీనివల్ల దేశంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్రమంత్రివర్గం ముందు ఉంచుతారు. అయితే దీనిపై కేబుల్ టివి వర్గాల స్పందన తెలియడంలేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం ఈ రంగ భవితవ్యాన్ని ఎలా మలుపు తిప్పుతుందో వేచి చూడాలి..

Source: medianx.tv

No comments:

Post a Comment