Tuesday, February 15, 2011

వటవృక్షంలా పెరిగిపోతున్న అవినీతి గుట్టు రట్టు చేసేందుకు న్యూస్- x ఛానల్ సిద్ధమైంది. అవినీతి జూలు విదిల్చే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) భాగోతం తాలూకు రహస్య ఫైళ్లు ఈ ఛానల్ చేతికి చిక్కాయి. కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి ఈ కీలక ఫైళ్లను ఈ సంస్థ సంపాదించ గలిగింది. అవినీతి మచ్చ పడిన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ పి.జె.థామస్ వంటి వారి పేర్లు ఎన్నో ఈ ఫైళ్లలో ఉన్నాయి. కరప్షన్ కింగ్‌లని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎ‍ఎస్ టాప్ మోస్ట్ అధికారులను అవినీతి రహిత అధికారులుగా క్లియర్ చేసి తిరిగి వారి నియామకానికి సివిసి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న వైనాన్ని ఈ ఛానల్ బయట పెట్టబోతోంది.

ఇలాంటి అవినీతి అధికారులందరిపైనా ఇదివరకే ఛార్జ్‌షీట్లు నమోదై ఉన్నాయి. ఇటీవలే థామస్ తోపాటు మరో ఏడుగురి పేర్లను సివిసి- టాప్‌మోస్ట్ పోస్ట్‌లకు అర్హులని కితాబు ఇచ్చింది. వీరిలో పలువురు ప్రభుత్వ నిధుల అవకతవకలకు, భూ కబ్జాలకు నిధుల స్వాహాకు పాల్పడినవారే. పామోలిన్ స్కాం మచ్చ పడిన థామస్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేరళ ప్రభుత్వం అనుమతించింది. ఇక తేజేందర్ కౌర్, అశోక్ కుమార్ వంటి వారికి సివిసి ‘క్లీన్‌చిట్’  ఇవ్వడం విశేషం. జడలు విప్పిన అవినీతిని కొంతవరకైనా అదుపు చేసేందుకు ప్రయత్నం జరగడం అభినందనీయమే.

Source: medianx.tv

No comments:

Post a Comment