కొన్ని ఛానల్స్‌లో వస్తున్న రియాల్టీషోలలో ‘పెద్దవారికి మాత్రమే’ ఉండే అంశాలను ఇక 20 ఏళ్లు పైబడినవారంతా ఆస్వాదించే అవకాశాలు ఉన్నాయి. తమకు ఇష్టమైన ‘అడల్ట్ రియాల్టీషో’లలో ‘ఎడిట్’ చేయని సన్నివేశాలను వారిక చూడవచ్చునట. అయితే ఇందుకు ఓ “రూల్” ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ వీటిని రాత్రి 11 తెల్లవారు జామున 4 గంటల మధ్య ప్రసారం చేసే ఛాన్స్ ఉంది. కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉంది. పిల్లలు చూడదగని రియాలిటీ షోలను ఆయా ఛానల్స్ ఈ సమయంలో మాత్రమే టెలికాస్ట్ చేయవచ్చునని ఈ శాఖ సూత్ర ప్రాయంగా భావిస్తోంది. ఈ విషయంపై ఈ శాఖ ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్‌తో చర్చిస్తోంది. ఇదంతా చూస్తుంటే మన భారతీయ సంస్కృతి ఎటు పోతోంది అన్న ప్రశ్న తలెత్తక మానదు.
Source: medianx.tv
No comments:
Post a Comment