Sunday, February 20, 2011

కళాకారులకు జీవం పోసేందుకే నాటకోత్సవాలు

నాటక కళకు ఆదరణ తగ్గిపోతోందని, నాటక కళాకారులకు జీవం పోసేందుకే ప్రభుత్వం నంది నాటకోత్స వాలను ప్రతిష్టాత్మకంగా నిర్విహస్తోందని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనే జింగ్‌ డైరెక్టర్‌ సి. పార్థసారధి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని మున్సిపల్‌ ఇండోర్‌ టౌన్‌హాల్‌లో శనివారం నంది నాటకోత్సవాలను ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ కళాకారులను ప్రోత్స హించేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి, డివిజన్‌ స్థాయిలో నాటకోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం చొరవతో 1990 నుంచి నంది నాటక పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. శాసన మండలి ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత నంది అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తామన్నారు.  నాటక పోటీలు ఆలస్యమైతే సమస్యలు ఉత్పన్నమవుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ పోటీలను నిర్విహస్తోందన్నారు. నాటకోత్సవాలలో మొదటి రోజున తిరుపతివారి సుబ్బరాజు నాట్యకళా పరిషత్‌ అహో…ఆంధ్రభోజ, విజయవాడ సాంస్కృతిక సమైఖ్య సంపూర్ణాకాశం, ఒంగోలు శ్రీకళాప్రకాశం నర్తనశాల నాటక ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ రామ్‌శంకర్‌నాయక్‌, జేసీ బుద్ధ ప్రకాష్‌ జ్యోతి, ఎస్పీ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Source: ankusam.com

No comments:

Post a Comment