టీవీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నది ప్రీతిజింతా మాట. సినిమా షూటింగ్‌లైతే - కావల్సినంత స్వేచ్ఛ. మనం చెప్పిందే వేదం. కానీ టీవీ విషయానికి వస్తే మాత్రం ఆ పప్పులేం ఉడికేట్టు లేవట. ఇది తాజాగా ప్రీతి అనుభవం. సినీ తారలంతా ఛానెళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయటంతో తానూ ఏ మాత్రం తీసిపోలేదని వచ్చిన ఒక్క అవకాశాన్ని ఓకే అనేసి ఆనక - నోరెళ్ల బెట్టింది. ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ - అబ్ ఇండియా తోడేగా’ని నిర్వహిస్తున్న ప్రీతి - ఈ ఒక్క రియాలిటీ షో ఎపిసోడ్‌తోనే గుక్క తిప్పుకోకుండా అయిందిట. మరి అమిత్‌జీ, సల్మాన్, షారుక్‌ఖాన్, అక్షయ్, ప్రియాంకా చోప్రా.. ఎలా నెగ్గుకు వస్తున్నారోనని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చూడబోతే - ఇంకెన్నో రోజులు ఈ కార్యక్రమంలో నిలబడేట్టు లేదు. ‘కలర్స్’ ఛానెల్‌లో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment