డిఎంకె ఆధ్వర్యంలోని కలైణర్ టివి కార్యాలయంపై సిబిఐ ముమ్మరంగా దాడులు జరిపింది. ఇందులో డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు సిఎం కరుణానిధి భార్య ఎం.కె. దాయాలు, కుమార్తె, ఎంపీకూడా అయిన కళిమొని భారీ షేర్‌హోల్డర్లుగా ఉన్నారు. 2 జిస్పెక్ట్రం కేసులో నిందితుడు, స్వాన్ టెలికామ్ ప్రమోటర్ అయిన షాహిద్ ఉస్మాన్ బల్వా – కలైణర్ టివిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని వార్తలు వచ్చాయి. ఆయనను ఇటీవలే సిబిఐ అరెస్ట్ చేసింది. టెలికాం మాజీమంత్రి రాజా నుంచి లబ్ది పొందిన వారిలో బల్వాకూడా ఒకరు. అయితే – తమ ఛానల్‍కు, ఈ కుంభకోణానికి సంబంధంలేదని కళిమొని అంటున్నారు. ‘గొప్పవారి గోత్రాలు ఎవరికెరుక’..!
Source: medianx.tv
No comments:
Post a Comment