Thursday, February 24, 2011

ఛానల్స్‌ రేటింగ్‌ పెంచిన భారత్‌ - బంగ్లా మ్యాచ్‌

ఐసీసీ వరల్డ్‌కప్‌లో ఈ నెల 19న భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ దేశవ్యాప్తంగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. టెలివిజన్‌ ఛానల్స్‌ రేటింగ్‌ను అమాంతం పెంచింది. రీసెర్చ్‌ ఏజెన్సీ టామ్‌ అందించిన వివరాల ప్రకారం ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో ఈ మ్యాచ్‌కు 12.48 టీవీఆర్‌ (రేటింగ్‌) లభించడం విశేషం. ఈ ఓపెనింగ్‌ మ్యాచ్‌ ఈఎస్‌పీఎన్‌, స్టార్‌స్పోర్ట్స్‌, స్టార్‌ క్రికెట్‌, డీడీ1 ఛానళ్ళకు 7.8 సగటు క్యూములేటివ్‌ టీవీఆర్‌ అందించింది. 6 ప్రధాన మెట్రోల్లో ఈ మ్యాచ్‌ను 27.4 మిలియన్ల మంది వీక్షించారు. ఆ ఆరు మెట్రోల్లోనూ ఈ ఆరంభమ్యాచ్‌ సగటు రేటింగ్‌లలో, గత ఐపీఎల్‌ సీజన్‌ 3 ఆరంభమ్యాచ్‌ రేటింగ్‌లతో పోలిస్తే 11శాతం పెరిగింది. ఈ ప్యాక్‌లో మొదటి మ్యాచ్‌కు సంబంధించి 9.17సగటు టీవీఆర్‌తో బెంగళూరు అగ్రభాగంలో నిలిచింది. ఓపెనింగ్‌ మ్యాచ్‌ హవా షషష.వరజూఅర్‌aతీ.షశీఎ లోనూ కొసాగింది. మొదటి మ్యాచ్‌కు 8.5 మిలియన్‌ పేజ్‌ వ్యూస్‌ లభించాయి. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ కోసం ఈ వెబ్‌సైట్‌కు ఇప్పటి వరకూ 3 మిలియన్ల వీడియో అభ్యర్థనలు అందాయి. ఈ వెబ్‌ స్ట్రీమింగ్‌ ఇప్పటికే 1మిలియన్‌కు పైగా వెబ్‌ వీక్షకులను ఆకట్టుకుంది.

Source: www.visalaandhra.com

No comments:

Post a Comment