Tuesday, February 15, 2011

ముగిసిన ‘మల్లిక’ ఎపిసోడ్

‘మల్లికా షెరావత్’ కల మూన్నాళ్ల ముచ్చట గా ముగిసినట్టేనా? ఛానెళ్లలో ప్రవేశించీ ప్రవేశించక మునుపే ‘ఊర్మిళ’ షాక్ ఇచ్చింది. డాన్స్ రియాలిటీ షో ‘చక్ ధూమ్ ధూమ్’లో న్యాయ నిర్ణేతగా అడుగుపెట్టినప్పటికీ - ఆమె స్థానంలో ఊర్మిళని తీసుకున్నారు. ఈ విషయంలో పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవట. ఒక్కపూటలో రెండు ఎపిసోడ్స్‌ని పూర్తి చేస్తుంది. లంచ్ టైం కూడా ఎక్కువగా తీసుకోదు. ఉన్నంతసేపూ పని ధ్యాసే. ఇంతకీ వచ్చిన చిక్కేమిటంటే - ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా ఇంటికి వెళ్లిపోతానంటుందిట. దీంతో ప్రొడక్షన్ టీం విసిగిపోయి ‘ఆ’ అమ్మణ్ణి ఇంటికి పంపించేయండని ప్రపోజ్ చేయటంతో - ఊర్మిళ ‘రీ ఎంట్రీ’ ఇచ్చింది. మరి ఈ అమ్మడు ఏం చేస్తుందో వేచి చూడాలి.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment