Monday, February 21, 2011

మాటివి ‘దూకుడు’

ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న ‘దూకుడు’ చిత్రం షూటింగ్ ఇటీవలే గుజరాత్‌లో ముగిసింది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చి 3 వరకు ఇది నిరాఘాటంగా కొనసాగుతుందట! ‘దూకుడు’ చిత్రం శాటిలైట్ హక్కులు 5.7 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిందంటే ‘ప్రిన్స్’కు ఎంత డిమాండ్ ఉందో అర్థమైపోతుంది. ఈ మధ్యే మా మూవీస్, మా కిడ్స్ ఛానెల్ “జూనియర్”లను ప్రారంభించిన మా టివి ఈ సినిమా శాటిలైట్ హక్కులను పొందిందట!

ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర! సమంత హీరోయిన్! ఎస్.థామస్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ‘దూకుడు’ సినిమా వచ్చే సమ్మర్‌లో విడుదల కానుంది.
 
Source: medianx.tv

No comments:

Post a Comment