Saturday, February 26, 2011

శాటిలైట్ టెక్నాలజీవైపు రేడియోచూపు

దశాబ్దాలుగా అతి మారుమూల ప్రాంతాలకు సైతం చొచ్చుకుపోయిన రేడియో శాటిలైట్ టెక్నాలజీవైపు దృష్టి సారించాలని బ్రాడ్‌కాస్ట్ మీడియాకు చెందిన నిపుణులు సూచిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ‘రేడియో ఆసియా-2011’ సదస్సులో పాల్గొన్న వీరు అత్యాధునిక టెక్నాలజీలు రేడియోకు మరింతగా తోడ్పడాలని కోరారు. బ్రాడ్‌కాస్టర్లకు శాటిలైట్ రేడియో ఓ వరం కావాలని వారు పేర్కొన్నారు. ఇండియాలో డిటిహెచ్‌పైగల ప్రతి వంద ఛానళ్లకు రెండు వందల రేడియో ఛానళ్లు అందుబాటులో ఉన్నా వాడుకలో లేకుండా వృధాగా ఉన్నాయని, బ్రాడ్‌కాస్టర్లు వీటిని వినియోగించుకోవాలని నిపుణులు సూచించారు. నేడు డిజిటల్ రేడియో ఆవశ్యకత ఎంతోఉందని అభిప్రాయపడ్డారు. షార్ట్‌వేవ్, మీడియం వేవ్‌లపై డిజిటల్ టెరెస్ట్రియల్ రేడియో వ్యవస్థను బ్రాడ్‌కాస్టర్స్ వినియోగించుకోవచ్చునని, అలాగే రేడియో కార్యక్రమాల కంటెంట్ పెంచేందుకు ఇంటర్నెత్‌ను ప్రధాన సోర్స్‌గా వాడుకోవాలని బ్రాడ్‌కాస్ట్‌ మీడియా నిపుణులు సూచిస్తున్నారు.

Source: medianx.tv

No comments:

Post a Comment