Monday, February 21, 2011

అవినీతి సొమ్ముతో పేపర్, ఛానల్

అవినీతి సొమ్ముతో పేపర్, ఛానల్ పెట్టి ఇష్టారాజ్యంగా వార్తలు రాసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, కార్యవర్గ సభ్యుల నూతన కార్యవర్గంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రహస్య ఎజెండాలతో కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు కొందరు వ్యక్తులను ప్రోత్సహించే కార్యక్రమానికి పూనుకుంటున్నాయని ఆరోపించారు. స్వతంత్రం వచ్చాక రాష్ట్రానికి ఎవరూ చేయనంత అన్యాయాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేశారని ఆరోపించారు. ఎమ్మార్, రహేజా ప్రాజెక్టుల ఒప్పందాలను మార్చి వేసి డబ్బులు కొట్టేసారని ఆరోపించారు. సర్వేల పేరుతో వ్యక్తులను ప్రోత్సహించి వారి ఎజెండాలు అమలు చేస్తున్నాయన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగదన్నారు. స్వంతంత్రంగా వ్యవహరించే మహిళలందరూ సమాజ హితం కోసం ముందు ఉండాలని సూచించారు.

Source: www.teluguone.com

No comments:

Post a Comment