Monday, February 21, 2011

క్రికెట్ ఫీవర్

45రోజుల ప్రపంచకప్ క్రికెట్ ఫీవర్  ప్రారంభమవుతున్న సందర్బంగా కోట్లాది క్రికెట్ అభిమానులకు ఈక్రీడపై ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు అనేక ఎలక్ట్రానిక్స్ సంస్థలు వేర్వేరు ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ఓనిడా, శ్యాంసంగ్ వంటి వివిధ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. అలాగే మెట్రోపాలిటన్ నగరాలలోని ఎలక్ట్రానిక్స్ షాపులు, మాల్స్‍లో అతిపెద్ద ప్లాస్మా టివిలను ఏర్పాటు చేస్తున్నారు. కస్టమర్లకు ఒకరకంగా గాలం వేస్తున్నారు. ఈ షాపులలో ఇక స్టార్ స్పోర్ట్స్, ఇఎస్‍పిఎన్ వంటి ఛానెల్స్ నిరంతరాయంగా లైవ్‍లో క్రికెట్ పోటీలను ప్రసారం చేయనున్నాయి. ఈ క్రికెట్ మహా సంగ్రామంలో విజేత ఎవరో ప్రపంచ కప్ ఎవరికి దక్కుతుందో ఎవరు చెప్పగలరు. ఆమధ్య ప్రపంచ సాకర్ పోటీలలో విజేతను నిర్ణయించేందుకు ‘జ్యోతిష్యం చెప్పే’ ఆక్టోపస్‍ను ఆశ్రయించారు. మరి మనకూ అలాంటి ఆక్టోపస్ అభిస్తుందా? భారత జట్టే గెలవాలని కోటిదేవుళ్లను ప్రార్థించే వారి ప్రార్థనలు ఫలిస్తాయా? లెటజ్ వెయిట్ అండ్ సీ!

Source: medianx.tv

No comments:

Post a Comment