బుధవారం గ్రూప్-ఎలో జింబాబ్వేతో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ రనౌట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో టివీ పగలగొట్టినట్టు వచ్చిన వార్తలపై ఆసీస్ మీడియా మేనేజర్ స్పందించారు. 'అతను టివి పగులకొట్టలేదు. ఒక బాక్స్‌ను గోడకేసి కొట్టడంతో అది వెళ్ళి టివి వెనక పడింది. దాంతో టివిలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ సంఘటన పట్ల వెంటనే పాంటింగ్ క్షమాణాలు చెప్పాడు. టీమ్ మేనేజర్‌కు వివరణ కూడా ఇచ్చాడు. దాంతో ఈ సమస్య అప్పటితో ముగిసిపోయింది' అని ఆసీస్ టీమ్ మీడియా మేనేజర్ లాకె పాటర్సన్ తెలిపాడు.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాజేష్ పటేల్ ఆస్ట్రేలియా జట్టు బసచేస్తున్న హౌటల్‌లో వారి వసతులను పర్యవేక్షిస్తున్నారు. పటేల్ వెంటనే ఈ సంఘటన పట్ల బిసిసిఐకి ఫిర్యాదు చేశారు. పాంటింగ్ పగలగొట్టిన టివిని ఫొటో తీసి బిసిసిఐకి పంపించారు. రికీ పాంటింగ్ ఒక కెప్టెన్ అయిఉండి ఇలా ప్రవర్తించడం ఆసీస్ జట్టుకు ఏమాత్రం మంచిదికాదని రాజేష్ పటేల్ అన్నాడు. జింబాబ్వే జరిగిన మ్యాచ్‌లో క్రిష్ మొఫూ విసిరిన డైరెక్ట్ త్రోకు రికీ పాంటింగ్ రనౌట్ అయ్యాడు. పాంటింగ్ తన అసహనాన్ని దాచు కోలేకపోయాడు. దాంతో విమర్శలపాలయ్యాడు.
Source: www.prajasakti.com
No comments:
Post a Comment