ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఫ్యాషన్ టివి త్వరలో ‘ఫ్యాషన్ టివి హెచ్‌త్రీడి’ ఛానెల్‍ను ప్యారిస్‌లో ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ టివి ఆర్‌ర్ శాట్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ నెట్‍వర్క్ సేవలను వినియోగించుకుంటుంది. తన ట్రయల్ రన్‌లో భాగంగా ఈ నెట్‍వర్క్ ఈనెల 18 నుంచి ఫ్యాషన్‌టివి త్రీడి ప్రసారాలకు శ్రీకారం చుట్టింది. ఇది 10 నిముషాలపాటు ప్రతిరోజూ వస్తోంది. అందాల భామల సోయగాలు, క్యాట్‌వాక్‌లు, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ వంటి సుందరీమణుల పోటీలతో కోట్లాది మందిని రంజింపజేస్తున్న ఫ్యాషన్ టివి 193 దేశాలలో ‘అందాల ప్రేమికుల్ని’ అలరిస్తోంది. డిటిహెచ్ నెట్‌వర్క్‌లపై హైక్వాలిటీ త్రీడి ప్రసారాలను అందజేయాలన్నదే తమ లక్ష్యమని ఆ టివి వర్గాలు తెలిపాయి. మరో ఛానల్ ప్రారంభంతో మరింత మందికి తాము చేరువవుతామని ఈ వర్గాలు వివరించాయి.
Source: medianx.tv
No comments:
Post a Comment