Tuesday, February 1, 2011

త్వరలో హాలీవుడ్ సీరియళ్ళు..

త్వరలోనే ‘యు.ఎస్.’ నెట్‌వర్క్ నుంచీ బోలెడన్ని హాలీవుడ్ సీరియళ్లు స్టార్ వరల్డ్, జీ కేఫ్, హెచ్‌బిఓలో తళుక్కున మెరవబోతున్నాయి. ఇప్పటికే యుఎస్ నెట్‌వర్క్‌లో పాపులరయిన ‘హవాయ్ ఫైవ్-ఒ’ టీవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. ఇదొక క్రైం థ్రిల్లర్. క్రైం అంటే ఇష్టపడే అభిమానులే కాదు.. ఎవరినైనా దృష్టి మరలనివ్వని రీతిలో ఉండే ఈ 22 ఎపిసోడ్ల కథ ఇప్పటికే ‘గోల్డెన్’ ప్రశంసలందుకుంది.

త్వరలోనే రాబోతున్న మరో కథ మైక్ అండ్ మోల్లీ - పూర్తి హాస్యభరిత కథ ఇది. ఇలాంటివి  ఎన్నెన్నో కథాంశాలు. ఒక్కోటి ఒక్కో రీతిన అలరించనుంది. ఇక ఏడుపుగొట్టు సీరియళ్లకూ.. రియాలిటీ షోలనూ పక్కనబెట్టేసి.. వీటిపై పడొచ్చు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment