Tuesday, February 1, 2011

బుల్లి తెర పై సంజయ్‌దత్‌

బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌ త్వరలో టివిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.‘దస్‌ కా దమ్‌’ టివి షో హోస్ట్‌గా చేస్తున్న సల్మాన్‌ ఖాన్‌ స్థానంలో ఆయన రానున్నట్టు సమాచారం. మొదటిసారిగా టివి షోలో దర్శనమిచ్చి తన అభిమానులను అలరించాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు.

సంజయ్‌దత్‌ ఇంతవరకు బుల్లి తెరపై ఎటువంటి షో చేయ లేదు. కానీ పాపులర్‌ టివి గేమింగ్‌ షో దస్‌ కా దమ్‌తో ఆయన కోరిక నెరవేర నుంది. ఈ షోలో త్వరలో ఆయన హోస్ట్‌గా కనిపించి బుల్లితెర రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ గేమ్‌ షో రూపు రేఖలను పూర్తిగా మార్చివేయాలని నిర్ణయించి నిర్వాహకులు సల్మాన్‌ స్థానంలో సంజయ్‌దత్‌ను తీసుకోవాలని నిర్ణయించారు. 

ఈ మేరకు టివి షో నిర్వాహకులు కొద్ది రోజుల క్రితం సంజూను సంప్రదించారు. ఈ మేరకు అతనితో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. ఇవేగాకుండా సంజయ్‌తో మరి కొన్ని టివి షోల నిర్వాహకులు కూడా మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఇవి కూడా ఓకే అయితే ఆయన బుల్లి తెర ప్రేక్షకులను మరింత అలరించే అవకాశం దక్కుతుంది. మరి సంజూ బాబా ఎంత వరకూ మెప్పిస్తాడో చూడాలి. 

Source: www.suryaa.com

No comments:

Post a Comment