Tuesday, February 1, 2011

వీణ తీగ దాటలేదు?!

అదేం చిత్రమోగానీ ‘బిగ్ బాస్’ (సల్మాన్‌ఖాన్ ఆధ్వర్యంలో వచ్చినది) ప్రసారాలు పూర్తయి మూడు వారాలు దాటినా దాని బాపతు భోగభాగ్యాలు ఇంకా చల్లారలేదు. తాజాగా పొరుగనున్న పాకిస్తాన్ దేశ నటి వీణా మాలిక్ ఉదంతం ఒకటి ప్రచారంలోకి వచ్చింది. విషయానికొస్తే..

‘నేను గీత దాటలేదు’
వీణామాలిక్ ఇటీవల చిన్న తెరపై బహుళ ప్రచారం పొందిన ‘బిగ్‌బాస్-4’లో అభ్యర్థినిగా పాల్గొంది. సరే ఆమెతోపాటు హిందీ నటుడు అస్మితా పటేల్... వగైరా వగైరా కూడా పాల్గొన్నారు. కార్యక్రమ సరళి ప్రకారం అపరిచితులు అన్నీ వదిలి వారేర్పరచిన ప్రదేశంలో కొన్నాళ్లు ఉండాలి. అలా ఉన్నప్పటి స్పందనల సమాహారమే ‘బిగ్‌బాస్’కి ప్రధాన దినుసు. ఈ స్పందనల వ్యవహారంలో వీణమ్మ - పటేల్ సాబ్‌తో అతి సన్నిహితంగా ఉన్నట్లు, ఇంకాస్త ముందుకెళ్లి కిస్సింగ్ సీక్వెన్సులు కూడా అయినట్లు వార్తలొచ్చేశాయి. దానికి వీణా మేడమ్ - అదేం లేదు. నేను ఆ ప్రోగ్రామ్‌లో నా సహాధ్యాయులైన శే్వత, మనోజ్‌లతో ఎలా ఉన్నానో, అస్మిత్‌తోనూ అలాగే ఉన్నా. నేను ఎలాంటి అభ్యంతరకర దుస్తులు కానీ, కిస్సింగ్ సీన్స్‌కి కానీ నేను వెళ్లలేదంటోంది. దాంతోపాటు ముక్తాయింపుగా అయినా నేను చిన్నతెరపై ఇంతకు ముందు జరగని వాటికేమీ నాంది పలకలేదంటోంది. ఈ స్టేట్‌మెంట్ చాలా అస్పష్టంగా ఉందని అక్కడి విమర్శకులు వెంటనే వీణకు చురకేశారు. వీణ మళ్లీ స్పష్టాతిస్పష్టంగా ‘నా పరిధులు నాకు తెలుసు.. అయినా నేనెప్పుడూ ఆ గీత దాటలేదు’ అంది. ఇంటర్వ్యూ ముగింపుగా వ్యాఖ్యాత వీణ అలా ప్రవర్తించి ఉండకుండా వుంటే బావుండేది అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ఇదిలా ఉండగా వీణ పోకడల్ని సపోర్ట్ చేసిన వారూ ఉన్నారు. వీణ విశ్వాసాలు వీణవి. అవేం తప్పు పట్టాల్సినవి కావు. మంచీ - చెడ్డా తెలియని మనిషేం కాదు. అవగాహన ఉన్న వనిత అని ప్రశంసించారు.

ఇదంతా ఇలా ఉండగా వీణా మాలిక్, అస్మితా పటేల్ హ్యాపీ బర్త్‌డే కోసం ముంబాయికి గత వారంలో ఎయిర్ డీమ్ చేయడం కొసమెరుపు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment