Tuesday, February 1, 2011

అమ్మ కాని అమ్మ..?

సోనీ టీవీ ‘మా ఎక్స్‌ఛేంజ్’ ఇప్పటికే సెట్స్ మీదికి వచ్చింది. పాశ్చాత్య టీవీ షో ‘వైఫ్ స్వాప్’ని రూపాంతరం చెందించి రూపొందిస్తున్న ‘మా ఎక్స్‌ఛేంజ్’ మొదటి ఎపిసోడ్‌లో పూజా బేడీ, అనూరాధా నిగమ్.. ఒకరి ఇంటికి మరొకరు మారారు. పొద్దునే్న లేచిన పిల్లలకి ఇదంతా ఆశ్చర్యంగానూ ఆందోళనగానూ ఉందిట. తమ తల్లి స్థానంలో మరొకరు తమ పనులన్నీ చేయటం.. ఏం మాట్లాడాలో - ఎలా ప్రవర్తించాలో అర్థం కాకుండా ఉందని అనటం పిల్లల వంతైంది. ఈ ‘అమ్మ కాని అమ్మ’ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని ఏ తీరున అలరించనుందో మరి?

కొత్త కాన్సెప్ట్‌లను పరిచయం చేస్తున్నామని అనుకుంటున్న ఛానెళ్ల బాగోతం చివరికి ఏ తీరానికి చేరనుందో చూడాలి.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment