Tuesday, February 15, 2011

కోటి ఆశలు?!

‘బిగ్ బాస్-4’ తెచ్చిపెట్టిన ఇమేజ్‌తో శ్వేత తివారీ - డాలీ బింద్రాలను అవకాశాల ప్రభంజనం చుట్టుముడుతోందిట. ‘శ్వేత’ ముద్దు ముద్దు మాటలూ - అమాయకత్వం.. నిద్రలేమి కళ్లతో - చూపరులను ఇట్టే ఆకట్టుకొని ఇంట్లో అమ్మాయిలానే కలిసిపోయింది. ‘డాలీ’ సంగతి చెప్పనక్కర్లేదు. తన భారీకాయం ఫ్లస్ భారీ వాయిస్‌తో గెస్ట్ హౌస్ దద్దరిల్లింది. షోలో పాల్గొన్న అభ్యర్థుల్నీ.. చూస్తున్న జనాన్నీ కూడా దడదడ లాడించింది. ఏది ఏమైతేనేం - అనేకానేక వివాదాలూ.. ప్ల కార్డుల హోరూ.. సామాజిక కార్యకర్తల హడావిడి మధ్య ‘షో’ వీలైనంత పాపులారిటీని సంపాదించి ఎట్టకేలకు ముగిసింది. ‘బిగ్ బాస్’ ఫేమ్‌తో ‘డాలీ’ షారుఖ్‌ఖాన్ ‘జోర్ కా ఝట్కా’లో పాల్గొనేందుకు అర్జెంటీనా వెళ్లింది. శ్వేతా తివారికి సోనీ టీవీ ‘అదాలత్’ షోని అందించింది. ఈ కార్యక్రమం వేలంటైన్స్ డే నాడు ప్రసారం కానుంది. షో ద్వారా కోటి రూపాయలు గెలుచుకోవటం మాటెలా ఉన్నా - శ్వేతకి కోటి ఆశల్ని తెచ్చిపెట్టింది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment