Wednesday, February 2, 2011

మా టీవీలో – గతజన్మ రహస్యం

గత సెప్టెంబరులో డాక్టర్ న్యూటన్ గారి  వినాయక చవితి సందేశాన్ని ప్రచురించడం జరిగింది, మీలో కొందరు చదివి/చూసి ఉంటారు… 

ఆ రోజు ఉదయం డాక్టరు గారి  హిందీ టీవీ సీరియల్ డీవీడీ ప్రివ్యూలను మా ఇంటిల్లిపాదీ చూడటం జరిగింది. ఎన్నో కోట్ల రూపాయలతో పునరాగత జీవితానికి (Near Death Experience) సంబంధించి, గతంలో ఎన్నడూ లేని విధంగా రూపొందిచారు ఆ ఛానల్ నిర్వహకులు. దోబారా జిందగీ అనే  ఈ ప్రోగ్రాము అతి త్వరలో హిందీ ఛానల్  ప్రగ్య(ప్రజ్ఞ)లో రాబోతుంది.

దోబారా జిందగీ (రెండవ జీవితం) రెండు ఎపిసోడ్లు  చూడగానే దిమ్మతిరిగి పోయింది నాకు. ఇటువంటి ప్రోగ్రాము మరొక్కటి ఎక్కడా కనలేదు, వినలేదు.

కొద్దో గొప్పో ఇన్ని సంవత్సరాలు దేశ విదేశాల్లోని అనేక ఆధ్యాత్మిక సంఘాల్లో తిరిగి అనేక మంది మాస్టర్లను కలిసి, పుస్తకాలు చదివి, స్వీయ రీసేర్చి చేసి, డాక్టర్ న్యూటన్, లక్ష్మి గార్ల వద్ద ట్రైనింగ్ పొందిన నాకు ఇలా అనిపిస్తే , మరి తెలుగు వారు… ముఖ్యంగా హిందీ రాని, టీవీ మాధ్యమం ఒక్కటి మాత్రమే కలిగిన పేద (తెలుగు) వారి సంగతేమిటి అని నాలో భావోద్వేగం కలిగింది.

తెలుగు జాతిలో పుట్టి తెలుగు వారి రుణం తీసుకోవడానికి ఇది చక్కని అవకాశం, ఇటువంటి అవకాశం మనకు ఎప్పుడు వస్తుందో అని నేను ఆవేదన పడుతుంటే, భార్యాభర్తలిద్దరూ (డా. న్యూటన్, డా. లక్ష్మి గార్లు) మొహాలు చూసుకున్నారు. అప్పటికి రెండు-మూడు రోజుల ముందే  ‘మా టీవీ’ వాళ్ళకు వీలు కాదు అని చెప్పారట!
ఇటువంటి ప్రోగ్రాములను చిత్రీకరించడం అన్నది ఎంతో ప్రయాసతో కూడిన విషయం, ఒళ్ళు హూనం కావడం ఖాయం అన్నది డాక్టరు గారి ద్వారా అప్పటికే వినడం జరిగింది. మరి మన అదృష్టమో, తెలుగువారికోసం వారు వొళ్ళు-హూనం-త్యాగానికి  మళ్ళీ సిద్ధపడ్డారో, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వెంటనే ఇండియాకు ఫోనే చేసి ఆ కార్యక్రమానికి అంగీకారం తెలిపారు.

ఆ తరువాత, ఈ కార్యక్రమం షూటింగ్ అఘమేఘాల మీద పూర్తి చేసుకొని అతి త్వరలో విడుదల కాబోతుంది. ఇది నేను ఎంతో సంతోషంతో, గర్వంగా మీతో పంచుకోవాలనుకున్న విషయం.

ఫిబ్రవరి 11 వరకు ఎదురుచూడండి, తప్పక చూడండి, మిత్రులతో పంచుకోండి – మా టీవీలో వచ్చే గత జన్మ రహస్యం.

Source: naganna.com

No comments:

Post a Comment